చల్లపల్లి: స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శ్రీకారం

61பார்த்தது
చల్లపల్లి: స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శ్రీకారం
చల్లపల్లి పెద్ద మస్జీద్ ఎదుట ముస్లిం స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి శ్రీకారం చుట్టారు. మంగళవారం ముస్లిం స్మశాన వాటికలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 15 లక్షలతో బహుళ ప్రయోజిత సామాజిక భవనం నిర్మాణానికి ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలపూడి పాపారావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி