ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని ఈనెల 31 వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించారు.