తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా గోకవరం మండలంలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు కొత్త ఆధార్లను నమోదు చేస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గోవింద్ మంగళవారం తెలిపారు. 0-5 వయస్సు, అప్డేషన్, పేరు, చిరునామా తదితర సేవలను అందిస్తున్నామన్నారు. గోకవరం, కామరాజపేట, రంపఎర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూళ్లలో ఉదయం 10. గంటల నుంచి సాయంత్రం 5. గంటల వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు.