పంచా రామం పుణ్యక్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయంలో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విశేష పూజలు, అభిషేక పూజలు, పుష్పార్చన పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి వారిని, అమ్మ వారిని నూతన పట్టు వస్త్రాలతో సర్వాంగా సుందరంగా అలంకరించారు. రాస్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించారు.