పశ్చిమగోదావరి: ఏపీలో స్కూళ్ల నిర్వహణకు రూ. 100 కోట్లు విడుదల
ఏపీలో స్కూళ్ల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంపి స్కూళ్లకు ₹8. 63cr కేజీబీవీలకు ₹35. 16cr, మండల రిసోర్స్ కేంద్రాలకు ₹8. 82cr, మిగతా స్కూళ్లకు ₹51. 90cr నిధులు ఇచ్చారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామాగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, తాగునీటి కోసం ఈ నిధులును వాడాలని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.