తూ.గో జిల్లాలో వైసీపీకి మరో షాక్
ఉమ్మడి ప. గో జిల్లాలో పలువురు వైసీపీ నేతలు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఆదివారం మంత్రి దుర్గేశ్ సమక్షంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ, వైస్ చైర్పర్సన్ వెంకటలక్ష్మితోపాటు ఏడుగురు కౌన్సెలర్లు జనసేనలో చేరారు. వారిలో షాకీరా బేగం, మాణిక్యమాల, జాన్ బాబు, శారదాదేవి తదితరులు ఉన్నారు. నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్లు మంత్రి నిమ్మల సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.