రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాట్రేనికోన మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్. ఏడుకొండలు రాజ్యాంగ విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించారు.