రాయవరం: పల్లెల్లో అభివృద్ధి పండుగ- ఎమ్మెల్యే వేగుళ్ల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామాలను సాకారం చేసుకునేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగేశ్వరరావు పేర్కొన్నారు. రాయవరం మండలంలో వెదురుపాక, వెంటూరు గ్రామాల్లో పల్లె పండగ వారోత్సవాలలో భాగంగా పలు అభివృద్ది పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో గ్రామాలు కనీస అవసరాలకు నోచుకోలేదన్నారు.