కొత్తపేట: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదు
సామాజిక మాధ్యమాలు వాట్సాప్ ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లలో వ్యక్తిగత సమాచారం పెట్టడం వల్ల ఇబ్బందులు ఉన్నాయని కొత్తపేట మెడికల్ ఐ సి టి సి కౌన్సిలర్ ఎం. దుర్గాప్రసాద్ సూచించారు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పి. రాజు అధ్యక్షతన విద్యార్థుల మానసిక ఆరోగ్యం పై సైబర్ బుల్లియింగ్ మరియు సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై శనివారం సదస్సు నిర్వహించారు.