కొత్తపేట: అపార్ ను వేగవంతం చేయండి
ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్)ను వేగవంతం చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ డిప్యూటీ కలెక్టర్ ఏ. మధుసూదన్ రావు ఉపాధ్యాయులకు సూచించారు. కొత్తపేట మండలం గంటి జడ్పీ హైస్కూల్ ను శుక్రవారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అపార్ డేటా ప్రోగ్రెస్ ను ఇన్ ఛార్జ్ హెచ్ఎం బండారు శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఎంవో బి. సుబ్రమణ్యం ఉన్నారు.