ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రైతుల పొలాల్లోకి ఫార్మా కంపెనీలు వ్యర్థాలను వదిలితే ఊరుకునేది లేదన్నారు. మనిషికి అన్నం పెట్టే రైతుల భూములు నాశనం చేసి రూ.కోట్లు సంపాదిస్తారని పారిశ్రామికవేత్తలపై ఫైర్ అయ్యారు.