కొత్తపేట: వంతెన నిర్మాణానికి రూ.4.95కోట్లు మంజూరు

57பார்த்தது
కొత్తపేట: వంతెన నిర్మాణానికి రూ.4.95కోట్లు మంజూరు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలంలోని వానపల్లి నుండి మూడు లంక గ్రామాలకు అనుసంధానమైన బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.4.95కోట్లు నిధులు మంజూరైనట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వానపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ బ్రిడ్జిపై పెద్ద పెద్ద గోతులు పడి ప్రమాదకరంగా తయారయిందన్నారు. గత ప్రభుత్వంలో ఇదిగో అదిగో బ్రిడ్జి అంటూ కాలయాపన చేసారు తప్ప బ్రిడ్జి నిర్మాణం జరగలేదన్నారు.

தொடர்புடைய செய்தி