డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా గోదావరి నదిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. గోదావరి నదిలో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు విహరించారు. సాయంత్రం 6 గంటలకు జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.