కాకినాడ ఆర్డిఓగా ఎస్. మల్లిబాబు కాకినాడ ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల నిర్వహించిన ఆర్డిఓ బదిలీల్లో భాగంగా కాకినాడ ఆర్డిఓ ఇట్ల కిషోర్ ను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో ఎస్. మల్లిబాబును కాకినాడ ఆర్డిఓగా నియమించారు. జిల్లా ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు నక్క చిట్టిబాబు, కార్యాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.