ప.గో జిల్లాలో తీవ్ర విషాదం
విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన సంఘటన ద్వారకాతిరుమలమండలం సీహెచ్ పోతేపల్లిలో చోటుచేసుకుంది.నిట్టా మరియమ్మ (52), స్థానికఆయిల్ ఫామ్ పరిశ్రమ వద్ద అల్పాహార దుకాణం నిర్వహిస్తోంది.శీతలీకరణ యంత్రంలోని పదార్థాలు తీస్తుండగావిద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడేమృతి చెందింది.ద్వారకాతిరుమలఎస్సై సుధీర్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.