ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ అయిందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. నల్లజర్ల ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అప్గ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి చేయాలని సీఎంకు ప్రతిపాదన చేశామన్నారు. తొలిదశలో 30 పడకల అసుపత్రికి అనుమతులు వచ్చాయని, దీనిపై సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.