గత 16 సంవత్సరాలుగా 104 వాహనం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన 104 వాహన సిబ్బంది పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. తమ సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యేకు పి. గన్నవరంలోని కార్యాలయం వద్ద వారు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు చెల్లించాలని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.