మామిడికుదురు జెడ్పీహెచ్ పాఠశాలకు చెందిన 91 మంది విద్యార్థులకు మంగళవారం మార్కెటింగ్ విజిట్ నిర్వహించారు. రాజోలు మండలం తాటిపాక షాపింగ్ మాల్లో వినియోగదారులకు అందించే సేవలు, వ్యాపార లావాదేవీలపై అవగాహన కల్పించారు. పీఎంశ్రీ పథకంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాలలో రెండు వృత్తి విద్యా కోర్సులు ప్రారంభించామని హెచ్ఎం నిరంజని తెలిపారు. దానిలో భాగంగా మార్కెటింగ్ విజిట్ ఏర్పాటు చేశామన్నారు.