విశాఖ: టపాసులు కాల్చి వినికిడి శక్తిని కోల్పోవద్దు
టపాసులు కాల్చి వినికిడి శక్తిని కోల్పోవద్దు అని కెజిహెచ్ విశ్రాంత ఇ ఎన్ టి వైద్య నిపుణులు డాక్టర్ బి. రామకృష్ణ కోరారు. బుధవారం విశాఖలోని ఎంవిపి కాలనీలోని ఎస్ వివి పి డిగ్రీ కళాశాలలో బాలవికాస్ ఫౌండేషన్ నిర్వహించిన బాణాసంచా అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అతిగా శబ్ద కాలుష్యానికి గురయ్యే కొద్ది వినికిడి శక్తిని మనం కోల్పోతామన్నారు. 85 డెసిబల్స్ కి మించి శబ్దం తట్టుకునే శక్తి మనకు లేదన్నారు.