ఏసిబి వలలో రంగంపేట మండల సర్వేయర్ చిక్కల ధర్మారావు చిక్కారు. రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన ఓ వ్యక్తి నుంచి సోమవారం రూ. 75వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి సర్వేయర్ చిక్కల ధర్మరావును పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎన్ వి భాస్కరరావు, డి వాసు కృష్ణ, వై సతీష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.