అమలాపురంకు చెందిన ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన వీరి భేటీలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ పరిస్థితులను ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.