జగ్గంపేట: జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుండగా ఉప సభాపతి అడ్డుకోవడంపై జ్యోతుల నెహ్రు అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానన్నారు. శాసన సభకి రావొద్దంటే రానని కఠినంగా మాట్లాడారు. కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా అని జ్యోతుల ప్రశ్నించారు.