ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం కమ్మపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు గొంగడాయి గుట్టుమీద వెలిసినటువంటి శ్రీ ఉమాదేవి సమేత గోకర్ణేశ్వర స్వామివారిని సోమవారం అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కారూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆమెను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.