కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు బీసీ నేత టెక్కలి శాసనసభ్యులు కింజరపు అచ్చం నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైల్వేకోడూరులో మండల పార్టీ ప్రెసిడెంట్ కొమ్మా శివ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ విశ్వనాథ నాయుడు గారి ద్వారా అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను మరియు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పాలన మీద అంబేద్కర్ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇంతటి అవినీతి పాలన చేసే ప్రభుత్వాన్ని ప్రభుత్వ పనితీరు ను ప్రజలు గమనిస్తున్నారని ఇందుకు తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవలసి వస్తుందని బడుగు బలహీన వర్గాల మీద కక్ష సాధింపు చర్య తగదని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల శ్రేయస్సు కొరకు పాటుపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆంధ్రప్రదేశ్ మనుగడను ముందుకు తీసుకెళ్ళి తన పార్టీ యొక్క విజ్ఞతను చూపించాలని వైసిపి పార్టీకి కితాబిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కొమ్మ శివ చిట్వేల్ మండల ప్రెసిడెంట్ కేకే చౌదరి ఓబులవారిపల్లి మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వర రాజు వైస్ ప్రెసిడెంట్అమర్నాథ్ ప్రధాన కార్యదర్శి తేనే పల్లి చిన్న మాజీ సర్పంచ్ శివయ్య బీసీ నేత మాజీ సర్పంచ్ మురళీధర్ గౌడ్ ఆవుల కుంట కృష్ణయ్య సిద్దేశ్వర మనీ మాజీ సర్పంచ్ చంగల్ రెడ్డి వెంకట రామరాజు విజయ్ వర్మ ధనంజయ రాజు నాగినేని వెంకటరమణ సుకుమార్ రెడ్డి అనంతరాజుపేట రమణారెడ్డి దుర్గయ్య చంద్రమౌళి కుమార్ చిగురుపాటి శంకరయ్య పాల్గొనడం జరిగింది.