కడప జిల్లా రైల్వేకోడూరులో సిపిఎం పార్టీ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మంగళవారం ఉదయం కోడూరులో ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిరసన తెలియజేయడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప , తగ్గడం లేదన్నారు. కరోనా వైద్యం బాధితులకు సక్రమంగా అందడం లేదన్నారు, మరణాలు కేసు లు కూడా పెరుగుతున్నాయన్నారు. ఒకపక్క ప్రజలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయారు అన్నారు. ప్రజలకు ఉపాధి కరువై ఉందన్నారు. ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళు తప్ప అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు అన్నారు. ఈ పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. వలస కార్మికులను, వ్యవసాయ కూలీలను అసంఘటిత రంగ కార్మికుల ను, ఆదుకోవాలన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి అకౌంట్లో నెలకు కుటుంబానికి 7500 రూపాయలు ఆరు నెలల పాటు ఇవాళ అన్నారు. పది కేజీల బియ్యం డిసెంబర్ వరకు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పెంచాలన్నారు. కూలి రేట్లు పెంచాలన్నారు కనీస వేతనం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో యువతీ యువకులకు, ఉపాధి భరోసా కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. కార్మిక చట్టాలు మార్పును ఉపసంహరించాలని, విద్యుత్తు సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రవేట్ పరం చేయడాన్ని తక్షణం ఆపు చేయాలన్నారు. పోరాటం ద్వారానే, ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలి అన్నారు.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం పేదలకు ఉపయోగపడే లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల ప� పైన పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ ఎమ్మార్వో మురళి సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు లింగాల యానాదయ్య, ఓ. జనార్ధన్, దేశ య్య, అవాజ్ మండల కన్వీనర్, పి. మౌలాలి భాష, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. శివయ్య , రెడ్డయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.