బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ సోషల్ వర్కర్ వై. విజయ కుమారి అన్నారు. మంగళవారం మైదుకూరు మండలంలోని వనిపెంట మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు బాల్య వివాహాల వల్ల కలిగే పరిణామాల గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గురించి వివరించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఓబులమ్మ, సచివాలయ మహిళా పోలీస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.