కులం పేరుతో వేధింపులు.. చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో కలకలం

69பார்த்தது
AP: పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సచివాలయంలో పని చేస్తున్న సర్వేయర్ యేసు రాజు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకట్రామయ్య తనను కులం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడని, వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. తనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ సెల్ఫీ వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி