వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రం సహా అన్నింటా వినుకొండ పట్టణం ఆదర్శంగా నిలవాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంగళవారం ఆదేశించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజాఫిర్యాదులపై మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి పట్టణ ప్రజలకు పురపాలక సంగం జవాబుదారీతనం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నెంబర్ 9933585666ను ఏర్పాటు చేశారు.