తెనాలి: సహానా కుటుంబానికి రూ.10లక్షలు అందజేత
ఇటీవల తెనాలికి చెందిన సహానా బ్రెయిన్ డెడ్ తో మృతిచెందిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహానా కుటుంబాన్ని పరామర్శించి రూ.10లక్షల సాయం ప్రకటించారు. శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెనాలికి వెళ్లి ఆ పరిహారం చెక్కును సహానా కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.