నరసరావుపేటలోని పట్టణంలో ఓ బట్టల షాప్ వ్యాపార లావాదేవీల విషయంలో వినియోగదారులు, యజమానికి మధ్య చోటుచేసుకున్న వివాదం ఆదివారం ఘర్షణలకు దారితీసింది. మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని ఓ దుకాణంలోకి 4రోజులు క్రితం ఇద్దరు వినియోగదారులు వచ్చారు. వస్త్రాల కొనుగోలు ధర విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది. పరస్పరం దూషించుకొని దాడికి దిగగా పెద్దలు సర్దిచెప్పి వివాదం సద్దుమణిగించారు.