మాచర్లలో దీపం పథకం-2 ను ప్రారంభించిన ఎమ్మెల్యే

72பார்த்தது
మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో దీపం పథకం-2ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం ప్రారంభించారు. పట్టణంలో అర్హులైన మహిళ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. సూపర్ 6 హామీలలో భాగంగా దీపం పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. కమిషనర్ వేణుబాబు, ఇన్ ఛార్జ్ సీఎంఎం రాజశేఖర్ పాల్గొన్నారు.