గురజాల: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సమావేశం మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫిర్యాదుల పరిష్కారానికి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆర్డీవోకు సూచించారు.