రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. నిర్జీవంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. మంగళవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. లోకేశ్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతూ అనేక మంది ప్రముఖులతో భేటీ అవుతున్నారని చెప్పారు.