గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రైల్వే ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, జీఎంసీ అధికారులతో కమిషనర్ పులి శ్రీనివాసరావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అరండల్ పేట నుంచి కొత్తపేట వైపు వెళ్లే ప్రధాన మార్గంలో 3వ వంతెనల వద్ద రైల్వే శాఖ నూతన ట్రాక్ ఎక్స్టెన్షన్ పనులు చేపట్టిందన్నారు. దీంతో ఈనెల 25 నుంచి 60 రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.