ఉండి: వైసీపీ నుంచి టీడీపీలోకి 150 మంది జంప్
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సమక్షంలో శనివారం చినపుల్లేరు, జక్కరం గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించారు. వీరిలో ఇద్దరు, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 32 మంది ఒకొక్కరూ లక్ష రూపాయలు చొప్పున చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.