ఉండి: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో సోమవారం నిర్వహించిన "తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు" కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వైసీపీ చెందిన ఆ గ్రామ సిట్టింగ్ సర్పంచ్ మరియు పలువురు వార్డ్ మెంబర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.