తాడేపల్లిగూడెం: ఓటరు నమోదుకు ఈనెల 6 వరకే గడువు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6వ తేదీలోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోవాలని తహశీల్దార్ ఎం. సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో 2021 నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు www. ceoandhra. nic. in వెబ్ సైట్ ద్వారా పేర్లు ఆన్లైన్ చేయించుకోవాలన్నారు. కావున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.