బోరుగడ్డ అనిల్ పై ఫిర్యాదు చేసిన ఉద్దగిరి రాణి అనే మహిళ స్టేట్ మెంట్ ను శనివారం వేలూరుపాడు పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయనని జంగారెడ్డిగూడెం కోర్టులో ప్రవేశపెట్టి, తర్వాత ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరావు పర్యవేక్షణలో పోలీసులు మరియు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.