లడ్డు ప్రసాదాన్ని తినకుండా చేసిన చంద్రబాబు
కులమతాలకు అతిథిగా ప్రజలందరూ ఎంత పవిత్రంగా లడ్డు ప్రసాదాన్ని కూడా చంద్రబాబు తినకుండా చేశారని పామర్రు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. మంగళవారం పమిడిముక్కల మండలం మంటాడలోని వేంకటేశ్వరస్వామిని కైలే అనిల్ కుమార్, వైసిపి నాయకులు, కార్యకర్తలు దర్శించుకున్నారు. గోవిందా నామస్మరణలతో ర్యాలీగా వైసిపి నాయకులు కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించారు.