నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం వద్ద ఈ నెల 14 నుంచి 20 వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రేడ్ వన్ లైబ్రరీయన్ కేజేఎస్ఎల్ కుమారి సోమవారం తెలిపారు. వివిధ విభాగాలలో గెలుపొందిన వారికి ముగింపు సభలో బహుమతి ప్రదానం జరుగునని చెప్పారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులు, పుస్తక ప్రియులు, పుర ప్రజలు అందరూ పాల్గొని విజ్ఞానాన్ని పెంపొందించు కోవాల్సిందిగా కుమారి కోరారు.