తుళ్లూరు: భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి: సీఎం
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు ను ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని, నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు.