మచిలీపట్నం: దేవాలయాల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దేవాలయాల వారీగా సమస్యలు, ఆస్తులు, ఆదాయాల వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.