మండవల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మండవల్లి మండలం చావలిపాడు వద్ద ఆదివారం ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన రామకిషన్ కు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బంధువు శ్రీరామ్ సుహాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.