కైకలూరు: సాంకేతిక లోపంతో ఆగిన పింఛన్ల పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పించన్ల పంపిణీ కార్యక్రమం కైకలూరులో శుక్రవారం ఉదయం ప్రారంభమైనప్పటికీ సాంకేతిక లోపంతో స్తంభించిపోయిది. ఉదయం నుండి పింఛను యాప్ పనిచేయక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెల్లవారుఝామున 5 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ 10శాతం కూడా పూర్తి కాలేదు. పైఅధికారులకు సమాచారం తెలిసిన సాంకేతిక లోపాన్ని సరిచేయకపోవడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు.