ఏలూరు జిల్లా చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మాదిరెడ్డి శంకర్రావుతో పాటు. నాటు సారా కేసులో నిందితురాలైన తాళం శివ కుమారిలను చింతలపూడి తాహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ సోమవారం తెలిపారు. చింతలపూడి మండలానికి చెందిన ఇరువురిని సెక్షన్ 129 బీఎన్ఎస్ 2023 చట్టం ప్రకారం బైండోవర్ చేసినట్లు సీఐ వెల్లడించారు.