బొబ్బిలి సిహెచ్ సీని వంద పడకల హాస్పిటల్ చేయండి
బొబ్బిలి సిహెచ్ సీని వంద పడకల హాస్పిటల్ గా తక్షణమే చేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనా గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ వద్ద చాలా మంచి డాక్టర్లు ఉన్నారని వంద పడకల ఆసుపత్రి చేయడం వల్ల రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లడానికి వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారని అన్నారు.