భీమవరం: వరద బాధితులకై సీఎంకు భీమవరం ఎమ్మెల్యే రూ. 1, 02, 00, 000 విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భీమవరం నియోజకవర్గం నుండి సేకరించిన రూ. 1,02,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. భీమవరం నుండి ఎంతో మంది దాతలు రూ. కోటి విలువైన విరాళాలు అందించి, ఆహార పొట్లాలు, భోజనాలు, మరెన్నో సహాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నారులు కూడా తమ విధంగా విరాళాలు సేకరించి అందించారని తెలిపారు.