రాజమండ్రి: దాడి కేసులో ఒకరికి జైలు శిక్ష
ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ అయిదో ఏజేఎఫ్సీఎం న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్ సీఐ అప్పారావు వివరాల మేరకు నగరంలోని మున్సిపల్ కాలనీకి చెందిన తాళ్ల రాజుపై బూసి శ్యామ్యూల్ 2021 ఫిబ్రవరిలో చిన్న విషయంలో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పలు వాయిదాల విచారణ అనంతరం నేరం చేసినట్లు నిర్ధారణ కావడంతో తీర్పు ఇచ్చారు.