రాజమండ్రి: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆపద సమయంలో పేదవారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పలువురి లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి వైద్య పరంగా సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.