రాజమండ్రి: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు 70 మంది హాజరు
వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం నందు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి చక్కటి వేదికని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్కు నిర్వహించిన ప్రవేశ పరీక్ష పత్రాలను కలెక్టర్ ఓపెన్ చేశారు. ఉమ్మడి తూ. గో జిల్లాల నుండి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు 70 మంది హాజరైనట్లు ఆమె చెప్పారు.